Gold Price Today : బంగారం కొనాలంటే ఇక భవిష్యత్ లో కష్టమేనేమో

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2025-06-15 03:09 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ముందుగానే మార్కెట్ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేశాయి. కిలో వెండి ధరలు లక్షా ఇరవై వేల రూపాయలకు చేరుకున్నాయి. ఇలా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా కొనుగోలు చేస్తారు? వారికి బంగారం భారంగా మారింది. బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. కొనుగోలు చేద్దామనే లోపు ధరలు అందనంత దూరంగా వెళ్లిపోతున్నాయి.

అందరికీ సాధ్యం కాదు...
బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ సాధ్యం కాదు. కేవలం కొందరికి మాత్రమే కొనుగోలు శక్తి ఉంటుంది. బంగారం అరుదైన వస్తువుగా మారే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఇజ్రాయిల్ - ఇరాన్ ల మధ్య యుద్ధం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, విదేశాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే బంగారం ధరలు ఇలా అమాంతం పెరిగిపోతున్నాయన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. బంగారం ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది ఇక జరగదని కూడా చెబుతున్నారు.
నేడు స్థిరంగా...
పెళ్లిళ్ల సీజన్ పూర్తి కావడంతో ఇక బంగారం కొనుగోలు చేసే వారు కూడా లేరు. దీంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు తమ నిర్వహణల ఖర్చు కూడా రాకపోవడంతో ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయినా ఏ మాత్రం స్పందన లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,200 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,680 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,20,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News