Gold Rates Today : ఈరోజు బంగారం ధరలను చూస్తే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2025-07-29 03:30 GMT

బంగారం కేవలం ఆభరణాలను మాత్రమే కాకుండా సెంటిమెంట్ గా చూసే రోజులు కూడా పోయేటట్లే కనిపిస్తున్నాయి. ధరలు తక్కువగా ఉంటే సెంటిమెంట్, మెడలోనూ, ఒంటినిండా ఆభరణాలుగా భావిస్తారు. అదే తమకు ధరలు అందుబాటులో లేకపోతే మాత్రం బంగారం అవసరం లేదన్న అభిప్రాయానికి వస్తారు. అప్పుడు సెంటిమెంట్ కూడా దగ్గరకు రానివ్వరు. బంగారం స్థానంలో మరికొన్ని ప్రత్యామ్నాయ వస్తువులను ఎంచుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయం అనుసరించి బంగారం, వెండి వస్తువులు తమ ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని భావిస్తారు. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలతో ఉన్న డబ్బు ఊడ్చి పెట్టకపోతుందన్న భావన ఎక్కువ మందికి కలుగుతుంది.

శ్రావణ మాసంలో...
శ్రావణ మాసంలో ధరలు పెరుగుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎందుకంటే ఈ సీజన్ లో శుభకార్యాలతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అది భారతీయుల సెంటిమెంట్. అయితే ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉండటంతో ఎక్కువ కొనుగోలు చేయకుండా అవసరమైనంత మేరకే కొనుగోలు చేస్తున్నారు. బంగారంపై పెట్టే ఖర్చు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇచ్చి పెళ్లి తంతును జరిపించుకుంటున్నారు. ధరలు తగ్గుతాయామోనన్న ఆందోళనతో బంగారం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావవడం లేదు.
నేడు స్థిరంగానే...
బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. బంగారం పై పెట్టుబడి పెడితే ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదని భావిస్తారు. అందులో వాస్తవమూ ఉంది. కానీ పెరిగిన ధరలను చూసి పెట్టుబడి పెట్టేవారు కూడా కాస్తంత ఆలోచనలో పడ్డారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. అయితే మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు రావచ్చు. బంగారం ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. లేకపోతే స్థిరంగా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,159 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,15,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News