Gold Price Today : గుడ్ న్యూస్ .. బంగారం ధరలు నేడు పెరగలేదు.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
బంగారానికి రెక్కలుంటాయి. ఎందుకంటే ఎప్పుడూ అది పరుగులు పెడుతూనే ఉంటుంది. ధరలు కాస్త తగ్గాయంటుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెరిగి మదుపరులతో పాటు కొనుగోలుదారులను కూడా నిరాశకు లోను చేస్తుంది. బంగారం, వెండి అంటే అందరికీ ఇష్టం. వాటిని కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు. అత్యంత విలువైన వస్తువులుగా నేడు మారిపోయాయి. బంగారం విషయంలో మాత్రం అనేక కారణాలు ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నప్పటికీ ఇంత ధరలు పెరగడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపకతప్పదు. నిన్న మొన్నటి వరకూ ఒకింత అందుబాటులో ఉన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఎవరికీ అందకుండా పోయాయి.
సీజన్ ముగియనుండటంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ ముగియనుండటంతో బంగారం కొనుగోళ్లు ఇప్పుడు ఉన్నంత కూడా ఉండవని, అయినా ధరలు పెరిగితే ఇక ఈగలు తోలుకోక తప్పదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బంగారం, వెండి ధరలు అనుకున్న దానికంటే భారీగా పెరిగింది. ప్రధానంగా పేద, మధ్యతరగతి, దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అలా పెరిగిన ధరలు ఎంత మేరకు వెళతాయన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. కొందరు మాత్రం బంగారం ధరలు పతనమవ్వడం ఖాయమని అంటున్నారు. ఎటూ తేల్చుకోలని స్థితిలో వినియోగదారులున్నారు.
ధరలు నిలకడగా...
బంగారం మరింత ప్రియంగా మారకముందే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మదుపరులు మాత్రం ఇంకా ఆలోచనలో ఉన్నారు. బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధరలు తగ్గితే నష్టపోయే అవకాశముందని భయపడి కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరుగంటలకు నమోదయిన బంగారం, వెండి దరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,980 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,070 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1, 10,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.