Gold Price Today : బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక భవిష్యత్ లో కష్టమేనేమో
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు భగభగమంటున్నాయి. వెండి ధరలు కూడా అదే రీతిలో పరుగులు పెడుతున్నాయి. దీంతో భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు రెండు ప్రధాన వస్తువులు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. గత కొద్ది రోజులు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకూ పది గ్రాముల బంగారం ధరపై పెరగడంతో ఇక కొనుగోలు చేయడానికి కూడా భయపడిపోతున్నారు. బంగారం అంటేనే ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అవసరం కాకపోయినా, ఆభరణంగా భావిస్తున్నప్పటీకీ ధరల పెరుగుదల చాలా మందిని నిరాశకు గురి చేస్తుంది.
సురక్షితమైనా...
ఇక బంగారంపై పెట్టుబడి సురక్షితమని అందరూ భావిస్తారు. ఖచ్చితంగా బంగారంపై డబ్బులు వెచ్చిస్తే నష్టం రాదన్న నమ్మకంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారు. కానీ ధరల పెరుగుదలతో పెట్టుబడిగా చూసే వారు కూడా ఒకింత ఆలోచనలో పడ్డారు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతను గుర్తు చేసుకుంటూ ఒకవేళ తగ్గితే నష్టం వస్తుందేమోనన్న భయంతో కొనుగోలుకు ఆసక్తి కనపర్చడం లేదు. బంగారం, వెండి వస్తువులు భారత్ లో ఎక్కువగా దక్షిణ భారత దేశంలోనే కొనుగోలు చేస్తారు. అందుకే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బంగారు దుకాణాలు ఎక్కువ. కానీ ఇక్కడే సేల్స్ తగ్గడంతో దుకాణ యజమానులు ఇబ్బంది పడుతున్నారు.
స్థిరంగానే....
బంగారం అంటే మక్కువ చూపించే మహిళలు కూడా ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వెండి వస్తువులను కొనుగోలు చేయాలన్నా కూడా వెనుకంజ వేయడానికి ధరల పెరుగుదల కారణం. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,400 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,710 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,000 రూపాయలుగా ఉంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.