Gold Rates Today : మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు...ధరలు ఎంత పెరిగాయంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

Update: 2025-04-25 03:54 GMT

బంగారం ధరలు తగ్గుతున్నాయన్న ఆనందం మాత్రం ఎంత మాత్రం లేదు. ఒక్కసారి తగ్గితే మరొకసారి పెరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగి పోయాయి. లక్ష రూపాయలను దాటేసిన బంగారం తిరిగి కొంత దిగివచ్చినట్లే కనిపించినా మళ్లీ పరుగు లంకించుకుంది. ఇలా ధరలు తగ్గాయని ఆనందం పడేలోపు అది ఆవిరవుతుంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. దీనికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నప్పటికీ రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమవుతాయని అంటున్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారానికి ఉన్న డిమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. అయితే అమ్మకాలు కొంత మేరకు తగ్గినా పూర్తి స్థాయిలో వ్యాపారులకు వచ్చే నష్టమేమీ లేదు.

ఈ ఏడాది ప్రారంభం నుంచే...
ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగు అందుకున్నాయి. బంగారం, వెండి ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కాదు. ముఖ్యంగా అమెరెకా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు విధిస్తున్న సుంకాల కారణంతో పాటు యుద్ధాలు కూడా ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ బంగారం ధరలు మరింతగా పెరగడానికి కారణాలుగా చెప్పాలి. రాను రాను ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. భారత్ - పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలపై ఉంటుందంటున్నారు.
నేటి ధరలు ఇలా...
బంగారాన్ని కొనుగోలు చేయడం ఒకప్పుడు అందరికి అలవాటుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇంత ధరలను పెట్టి కొనుగోలు చేయడం సామన్య, సాధారణ ప్రజలకు సాధ్యపడకపోవడంతో బంగారం, వెండి అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెప్పాలి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,450 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,960 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,00,186 రూపాయలుగా కొనసాగుతుంది.
Tags:    

Similar News