Gold Rates Today : బంగారం ధరలు మరింతగా పెరిగాయిగా... ఇక ఆగేట్లు లేవుగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం ధరలు ఒకరోజు తగ్గితే పది రోజులు పెరుగుతుంటాయి. ధరలు మరింత ప్రియమవుతాయని ముందుగానే మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ పెరిగిన ధరలను చూసి కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలోలా ఇప్పుడు బంగారం ధరలు పెరిగితే కొనుగోలు చేయాలన్న ఆసక్తి చనిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బంగారు దుకాణాల్లోకి అడుగుపెట్టడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చిన తక్కువలో తక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ తమకు అవసరమైనంత మేరకే కొనుగోలు చేస్తున్నారు తప్ప, ఎగబడి కొనుగోలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో జరగడం లేదని చెబుతున్నారు.
కొనుగోళ్లు తగ్గి...
ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమై అనేక రోజులు దాటింది. పెళ్లిళ్ల సీజన్ లో ఇంత దారుణంగా వ్యాపారాలు మునుపెన్నడూ జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. గత సీజన్ తో పోలిస్తే బంగారం కొనుగోళ్లు 70 శాతం మేరకు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేద్దామని వచ్చిన వారు సయితం ధరలను చూసి వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో కొనుగోలు చేస్తారని తాము ఎక్కువ స్టాక్ తెప్పించామని, కానీ అవి అమ్ముడు పోక షాపులోనే ఉండిపోయాయని తెలిపారు. ధరలు పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెరుగుతుండటంతో ఇక త్వరలోనే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
బంగారం పెరిగి...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా అందరూ గుర్తిస్తారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోళ్లపై ఆసక్తి కనపరుస్తారు. కానీ మహిళలు కూడా ధరలు చూసి ఆసక్తి కనపర్చకపోవడం వల్లనే కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 320 రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై 300 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,770 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,07,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. బంగారు దుకాణాలన్నీ వినియోగదారులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి.