Gold Price Today : షాకిచ్చిన బంగారం.. శాంతించిన వెండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Update: 2025-01-26 02:47 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ఎప్పటి నుంచో అంచనాలు వినపడుతున్నాయి. అందుకు తగినట్లుగానే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ రోజు ధరల పెరుగుదల ఆగలేదు. మధ్యలో ఒకటి రెండు రోజులు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినప్పటికీ ధరలు పెరగడంతో ఇప్పుడు సామాన్య ధరలకు అందనంత దూరంలో బంగారం ధరలు చేరిపోయాయనే చెప్పాలి. ఇప్పటికే తులం బంగారం ధర 82 వేలు దాటింది. కిలో వెండి లక్ష ఐదు వేల రూపాయలకు చేరింది. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు కూడా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు.

కొద్ది రోజులుగా...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావస్తున్నా అందుకే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏదైనా ధరలు తగ్గుతుందేమోనన్న ఆశతో వారు వెయిట్ చేయడంతోనే బంగారం కొనుగోళ్లు ఇటీవల కాలంలో మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు. గత సీజన్ తో పోలిస్తే దాదాపు నలభై శాతం కొనుగోళ్లు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభావం బంగారం ధరలపై పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వెండి ధరలు కూడా అమాంతం పెరగడంతో వాటి క్రయవిక్రయాలు కూడా సాగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు పెరగడంతో...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ పెరగలేదని వినియోగదారులు చెబుతున్నారు. బంగారం, వెండి అంటే సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కొనుగోలు చేయాలి కాబట్టి నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,550 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,420 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,05,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News