Gold Price Today : ఒక్కసారిగా ఇలా షాకిచ్చిందేమిటో? ఇంతగా పెరిగితే కొనేది ఎలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

Update: 2025-01-18 03:26 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎంతగా అంటే ఎవరికీ అందుబాటులో ఉండనంతగా అవి రోజురోజుకూ పెరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండి ధరలకు కళ్లెం వేయడం అనేది అసాధ్యమన్నది అందరికీ తెలిసిందే. కానీ పరుగులు పెట్టకుండా నిదానంగా పెరుగుదల ఉంటే ఇంత బాధ అనిపించదు. కానీ భారీ పెరుగుదల కనిపించినప్పుడు మాత్రం ఇక భవిష్యత్ లో కొనలేమోమోన్న బెంగ బంగారం ప్రియులకు పట్టుకుంది. ముఖ్యంగా అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచ్చిన వారికి మాత్రం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అస్సలు కొనుగోలు చేయడం వేస్ట్ అన్న ధోరణికి అనేక మంది వస్తున్నారంటే అందుకు ధరలు పెరగడమే కారణం.

ఇన్వెస్ట్ చేయాలంటే?
పది గ్రాముల బంగారం ధర 81 వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర లక్ష రూపాయలకు ఎక్కువగా కనపడుతుంది. ధరలను చూస్తుంటేనే బంగారం ఉన్న మక్కువ కాస్తా మరుగునపడిపోయే అవకాశముంది. బంగారాన్ని కొనుగోలు చేసే కంటే మరో దానిపై ఇన్వెస్ట్ చేయడం మంచిదన్న ఆలోచన చాలా మందిలో కలగడానికి ధరలు అమాంతంగా పెరగడమే కారణమని ఖచ్చితంగా చెప్పాలి. ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. గత వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై దాదాపు రెండు వేల వరకూ పెరిగింది. అలాగే కిలో వెండి ధరపై నాలుగు వేల రూపాయలు పెరిగింది. బంగారం పై పెట్టుబడి పెట్టే వారు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.
ధరలు పెరిగి...
బంగారం, వెండి వస్తువులను ఇక కొనుగోలు చేయడం గగనమే అవుతుంది. ఎందుకంటే ఇంత ధరలు పెట్టి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కొనుగోళ్లపై బంగారం ధరల ప్రభావం పడుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,510 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 81,280 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,04,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News