Gold Rates Today : పండగ పూట షాకిచ్చిన బంగారం ధరలు.. ఇక ఆగేటట్లు కనిపించడం లేదుగా

బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. వెండి ధరలు ఇప్పటికే కిలో లక్షన్నరకు చేరుకున్నాయి.

Update: 2025-09-30 03:57 GMT

బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. వెండి ధరలు ఇప్పటికే కిలో లక్షన్నరకు చేరుకున్నాయి. బంగారం ధరలు కూడా పది గ్రాములు లక్షన్నరకు త్వరలోనే చేరుకుంటాయన్న అంచనాలు వినపడుతున్నాయి. బంగారం ధరలు తగ్గడం అనేది జరగదు. పెరగడమే తప్ప దానికి మరొక విషయం తెలియదు. అందుకే బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేసినా ఇబ్బంది ఏమీ ఉండదని, నష్టం రాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారం విషయంలో ఎవరూ కొనుగోలు చేశామని చింతపడే రోజు రాదని చెబుతున్నారు. అందుకే బంగారాన్ని ధైర్యంగా కొనుగోలు చేయడానికి సంకోచించాల్సిన పనిలేదని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ కూడా చెబుతున్నారు.

తగ్గే అవకాశం లేదని...
బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగరు. ఎంత ధర పెట్టైనా కొనుగోలు చేస్తారు. అవసరం కంటే బంగారాన్ని కొనుగోలు చేయడంలోనే ఆనందం వెతుక్కుంటారు. అందుకే కొందరు బంగారం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కుతగ్గరు. అందుకే దేశంలో బంగారం ధరలు ఇంతగా పెరిగినప్పటికీ కొనుగోళ్లు కొంత జరుగుతూనే ఉండటానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో బంగారం విషయంలో పెట్టుబడి పెట్టే వారు కూడా సురక్షితంగా భావించి కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో మధ్యతరగతి, వేతన జీవులు బంగారాన్ని కొనుగోలు చేయడం అసాధ్యమవుతుందని కూడా అంచనాలు వినపడుతున్నాయి.
భారీగా పెరిగిన బంగారం...
ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారానికి రెక్కలు వస్తున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగింది. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,16,410 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,06,710 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,60,100 రూపాయలుగా ట్రేడ్ అయింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించవచ్చు.
Tags:    

Similar News