Gold Price Today : గుడ్ న్యూస్.. పసిడిని సొంతం చేసుకోవడానికి ఇదే సరైన టైం
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపిచింది
బంగారం ధరలు మండిపోతున్నాయి. ఎంత ధరలు తగ్గాయని చెబుతున్నప్పటికీ ఇంకా సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాలేదన్నది వాస్తవం. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడే బంగారం ధరలు తగ్గినట్లు లెక్క. అప్పటి వరకూ ధరలు కొంచెం కొంచెం తగ్గినప్పటికీ ప్రయోజనం లేదని వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో పాటు అమెరికా, చైనా ట్రేడ్ వార్ ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతుంది. హెచ్చుతగ్గులు ప్రతిరోజూ ఉంటున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ధరలు తగ్గకపోవడంతో అమ్మకాలు కూడా ఇంకా ఊపందుకోలేదు. మరి కొంత కాలం తర్వాత ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
క్రేజ్ తగ్గిందా?
బంగారం అంటే అందరికీ క్రేజ్ ఉండేది. కానీ అది ఒకప్పుడు. కానీ ధరలను చూసిన తర్వాత క్రేజ్ స్థానంలో నిర్లిప్తత ఏర్పడింది. జ్యుయలరీ దుకాణాలు ఎంత భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ బంగారం విషయంలో టెంప్ట్ అవ్వడం లేదు. ధరలు విపరీతంగా పెరగడంతో వేచి చూడాలన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మరొకవైపు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా ధరలు అందుబాటులో లేకపోవడంతోనే కొనుగోలు చేయాలన్న ఇంట్రస్ట్ పోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేసే దానికంటే వేరే దానిపై పెట్టుబడి పెట్టడం మంచిదన్న అభిప్రాయంలో చాలా మంది వచ్చేశారన్నది కూడా వాస్తవం.
కొద్దిగా తగ్గి...
కానీ ధరలు స్వల్పంగా తగ్గితే దాని ప్రభావం వెంటనే ఉండదని, కొనుగోలు చేసే వారు నెమ్మదిగా పెరుగుతారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి ఎప్పటికైనా సురక్షితంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపిచింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,540 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర1,08,900 రూపాయలుగా ఉంది.