Gold Price Today : మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ధరలు ఎంత పెరిగాయో తెలుసా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Update: 2025-05-27 03:34 GMT

బంగారం ధరలు ఎప్పుడూ అంతే. ఒకరోజు తగ్గినట్లు కనిపిస్తే మరుసటి రోజు పెరగడం రివాజుగా మారింది. అయితే ఈ ఏడాదిలో మే నెలలోనే లక్ష రూపాయలు దాటిన పది గ్రాముల బంగారం ధర మళ్లీ క్రమంగా దిగి రావడం ఒకరకంగా మంచి వార్త అయినప్పటికీ ఇంకా ధరలు తగ్గుతాయేమోనన్న భావనలో అనేక మంది వినియోగదారులున్నారు. అయితే ధరలు కొద్దిగా తగ్గడం, భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులతో పాటు పెట్టుబడి దారుల కోరిక కూడా నెరవేరేటట్లు కనిపించడం లేదు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి మరికొంత సమయం వేచి చూద్దామన్న ధోరణి వినియోగదారుల్లో కనపడుతుండటంతో అమ్మకాలు పెద్దగా జరగడం లేదు.

అనేక కారణాలతో...
అదే సమయంలో బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాలలో నెలకొన్న మాంద్యం, ట్రంప్ నిర్ణయాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం లేదని, ఎక్కువగా తగ్గడం అనేది జరగదని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ కూడా చెబుతున్నారు. కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి బంగారం ధరలు కొంతవరకూ అందుబాటులో వచ్చినట్లేనని, ఇదే కొనుగోలుకు సరైన సమయం అని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడే డిమాండ్...
బంగారానికి దక్షిణ భారతదేశంలోనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్ గా బంగారం, వెండి వస్తువలు కొనుగోలును భావిస్తారు. శుభకార్యాలకు విధిగా వీటిని కొనుగోలు చేయడం అలవాటు కావడంతో ఇక్కడే వీటికి అత్యధిక డిమాండ్ ఉంది. అయితే బంగారం పట్ల ఆకర్షణ క్రమంగా ధరలు చూసి తగ్గుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,500 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,780 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,11,100 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News