Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సండే గుడ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం కొనుగోలు చేసే వారికి ధరలు తగ్గితేనే శుభవార్త కాదు. పెరగకపోయినా అతి తీపి కబురే అవుతుంది. ఒక్క బంగారం విషయంలోనే కొనుగోలుదారులు అలా ఆలోచిస్తారు. ధరలు పెరగకుండా ఉంటే చాలు. తగ్గకపోయినా పరవాలేదు అన్న ధోరణికి వచ్చేశారు. ఎందుకంటే బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటాయి. తగ్గకపోయినా స్థిరంగా ఉంటే చాలు కొనుగోలుకు సరైన సమయం అని భావిస్తారు. మళ్లీ ధరలు పెరుగుతాయని భావించి కూడదీసుకుని మరీ కొనుగోలు చేయడం వినియోగదారులకు అలవాటుగా మారింది. అందుకే దేశంలో బంగారం ధరలు పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నప్పటికీ కొనుగోళ్లు పై పెద్దగా ప్రభావం చూపవన్నది మార్కెట్ నిపుణుల మాట.
భవిష్యత్ సంపదగా...
బంగారం అంటే భవిష్యత్ సంపదగా భావిస్తారు. అది ఉంటే చాలు తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటారు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా బంగారాన్ని డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేయడం అలవాటు చేసుకున్నారు. అందుకే భారత్ లో ఉన్న బంగారం నిల్వలు మరే దేశంలో ఉండవని అంటారు. బంగారం నిల్వలు రిజర్వ్ బ్యాంకు వద్ద కూడా అత్యధికంగా ఉన్నాయని అధికారులు చెబుుతన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆ రాష్ట్రాల్లోనే బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువయిందని వ్యాపారులు చెబుతున్నారు.
స్థిరంగా నేడు ధరలు...
మరోవైపు బంగారం, వెండి రెండు వస్తువులకు ఎప్పుడూ గిరాకీ తగ్గదు. ఆ ఒక్క కారణంతోనే ధరలు పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా, సీజన్లతో నిమిత్తం లేకుండా కొనుగోళ్లు చేస్తుంటారు. అందుకే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఒక సమయం ఉండదు. వీలయినప్పుడల్లా వివిధ రూపాల్లో కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,620 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,00,000 రూపాయలుగా కొనసాగుతుంది. ఉదయం ఆరు గంటల వరకే నమోదయిన ధరలు మాత్రమే ఇవి. మధ్యాహ్నానికి మార్పులుండవచ్చు.