Gold Price Today : లక్ష దాటేసిన బంగారం ధరలు.. ఇక గోల్డ్ కొనడం కష్టమేమో
బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లక్ష రూపాయలు దాటేసింది. వెండి ధరలు కూడా అందుబాటులో లేవు
బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మే నెలలో లక్షల రూపాయలు దాటిన బంగారం ధర క్రమంగా తగ్గింది. అయితే మళ్లీ జూన్ లో పది గ్రాముల బంగారం ధర మళ్లీ పెరిగి లక్ష రపాయలను దాటేసింది. బంగారం ధరలు పెరిగినప్పుడు విపరీతంగా పెరుగుతాయి. తగ్గినప్పుడు స్వల్పంగా తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదల కారణంగానే ఇక్కడ కూడా ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.
యుద్ధ మేఘాలతో...
ప్రస్తుతం ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం జరుగతుండంతో దాని ప్రభావం బంగారం పై పడిందని కూడా అటున్నారు. ఇక బంగారం కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బంగారం ఎప్పుడో దూరమయింది. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే బంగారం ధరలు అందుబాటులో ఉంటున్నాయి. మరొకవైపు అమ్మకాలు పడిపోవడంతో జ్యుయలరీ దుకాణాల నుంచి పాత కస్టమర్లకు ఆఫర్లు ఇస్తున్నామని వచ్చి కొనుగోలు చేయాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అనేక జ్యుయలరీ దుకాణాలు ఆఫర్లు ప్రకటిస్తూ తమ కస్టమర్లకు తెలియజేసే పనిలో ఉన్నాయి. ఫోన్ కాల్ కారణంగా ఎంతో కొంత కొనుగోలు చేస్తారని భావించి ఈ రకమైన వ్యాపారానికి దిగారు.
మళ్లీ పెరిగి...
ఇక పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం కొనుగోలు విషయంలో ఆలోచనలోపడ్డారు. బంగారం ధరలు పెరిగితే మళ్లీ తగ్గవన్న గ్యారంటీ లేకపోవడంతో తమ పెట్టుబడులు సేఫ్ కాదని ఆలోచించి వెనక్కు తగ్గుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు ఇలా నమోదయి ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,960 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,20,100 రూపాయలుగా ఉంది.