Gold Rates Today : బంగారం ధరలకు ఇక కళ్లెం వేయలేరేమో.. ఇలా పరుగులు తీస్తే ఎలా?

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి

Update: 2025-02-07 03:13 GMT

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభిస్తే ఇక ఆగేట్లు లేవు. ఎందుకంటే ధరలు మరింతగా పెరుగుతాయని ముందు నుంచి ఊహించిందే అయినా ఇంత భారీ స్థాయిలో పెరుగుతాయని ఎవరూ అంచనా వేయలేదు. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగినా పరవాలేదు అన్న ధీమాలో ఉన్న వారికి రోజూ రేట్లు షాక్ ఇస్తున్నాయి. వందల రూపాయలు గ్రాముల్లో పెరుగుతుండటంతో కొనుగోలు చేయడానికి వచ్చిన వారు గోల్డ్ కొనలేక గుడ్లు తేలేస్తున్నారు. ఇంత ధరలు పెట్టి కొనుగోలు చేయాలంటే తమ శక్తి సరిపోదని వెనక్కు వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది.

రికార్డు స్థాయిలో...
బంగారం ధరలు మరింత పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నా కొనుగోలు దారులకు అందుబాటులో లేకపోతే దాని ప్రభావం సేల్స్ పై పడుతుంది. క్రయవిక్రయాలు తగ్గుతాయని అందరూ ఊహించినట్లే జరుగుతుంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 86 వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి లక్షా ఏడు వేల రూపాయలకు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని భావించినా ధరలను చూసి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ఇక పుట్టినరోజులు, శుభకార్యాలకు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన వారు కూడా తమ ఆలోచనను విరమించుకుని మరొకటి కొనుగోలు చేస్తుండటంతో బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.
ధరలు పెరిగి...
ఇక పెట్టుబడి దారులు కూడా సంకోచిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమైనదని అందరూ అనుకుంటున్నా ఇంత పెద్దమొత్తంలో వ్యయం చేస్తే రేపు ఉన్నట్లుండి ధరలు పడిపోతే ఎలా అని సందిగ్దంలో పడ్డారు. అయితే ధరలు తగ్గే అవకాశం లేదని, పెట్టుబడిదారులు ముందుకు రావాలని మార్కెట్ నిపుణులు కోరుతున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79.310 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,520 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1.06, 900 పలుకుతుంది.


Tags:    

Similar News