Gold Price Today : ఈరోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయో తెలుసా.. తెలిస్తే?
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తుంటాయి
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తుంటాయి. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలకు కళ్లెం పడటం లేదు. అనేక కారణాలతో ధరలు పెరగడమే కాని, తగ్గడం అనేది జరగడం లేదు. తగ్గినా కొద్దిగా తగ్గడంతో కొనుగోలు దారులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. అదే ధరలు మాత్రం పెరిగాయంటే భారీగా వందల రూపాయలు పెరుగుతాయి. తగ్గితే పది రూపాయలు తగ్గుతాయి. బంగారం అవసరం కాదు. అలంకారం మాత్రమే. అందుకే ఇంత ధరలను పెట్టి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాపారులు సయితం చెబుతున్నారు.
కొనుగోలు చేయాలంటే...
బంగారం, వెండి అంటే స్టేటస్ సింబల్ గా ఉండేది. ఇప్పుడు అది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమయింది. బంగారంపై మక్కువ ఉన్నప్పటికీ దానిని కొనుగోలు చేయాలంటే తమ ఆర్థిక శక్తి సరిపోవడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. అవసరాలకు కొనుగోలు చేయాలన్నా కొంత తగ్గించి కొనుగోలు చేస్తున్నారని, పెళ్లిళ్లకు అవసరమైన బంగారంలో కూడా తక్కువ గ్రాములతో తయారు చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో దాదాపు 60 నుంచి 70 శాతం కొనుగోళ్లు తగ్గాయన్నది వ్యాపారుల మాటగా ఉంది. అదే సమయంలో పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపర్చడం లేదు.
నేటి ధరలు...
బంగారం, వెండి వస్తువులను సాధారణ, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మరొక వైపు ఇతర దేశాల నుంచి దిగుమతి కావాల్సిన బంగారం కూడా రాకపోవడంతో్ సరిపడినంత బంగారం నిల్వలు లేకపోవడం వల్లనే ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,390 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 86,610 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర 1,04,800 రూపాయలుగా ఉంది.