Gold Rates today : పసిడి ధరలు భారీగా పడిపోనున్నాయా? నిపుణులేమంటున్నారు?
బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయని కొందరు చెబుతుండగా, భారీగా ధరలు తగ్గే అవకాశముందని మరికొందరు అంచనా వేస్తున్నారు
బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయని కొందరు చెబుతుండగా, భారీగా ధరలు తగ్గే అవకాశముందని మరికొందరు అంచనా వేస్తున్నారు. అనేక పరిణామాలతో బంగారం ధరలు తగ్గే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో బంగారం కొనుగోళ్లపై ఈ ప్రభావం బాగా పడిందనే చెప్పాలి. బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని చాలా మంది వేచి చూస్తున్నారు. మరొకవైపు పెట్టుబడి పెట్టేవారు సయితం ఇప్పుడున్న ధరలతో కొనుగోలు చేస్తే రేపు ధరలు భారీగా పతనమయితే నష్టం చవిచూడాల్సి వస్తుందని భయపడి పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏతా వాతా ఇటు ధరలు పెరుగుదల, అటు తగ్గుతాయన్న ప్రచారం కలసి కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి.
ఒక్కసారి పెరిగితే...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన సుంకాల మోత, అమెరికా షట్ డౌన్ వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ తో పాటు శుభకార్యాలు కూడా నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు ఆశించిన రీతిలో తగ్గవని చెబుతున్నారు. సీజన్ అయినప్పటికీ బంగారం అమ్మకాలు పెద్దగా జరగడం లేదు. కేవలం కొందరికే బంగారం సొంతమయ్యేలా కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి, ఉద్యోగవర్గాల వారు మాత్రం బంగారం ధరలను చూసి కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. దీంతో కొనుగోళ్లు చాలా వరకూ తగ్గిపోయాయని అంటున్నారు.
స్వల్పంగా తగ్గి...
అలాగే బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం లేదన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. ఒక్కసారి పెరిగిన బంగారం ధరలు భారీగా పతనమయిన ఘటనలు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,640 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,640 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మరింత మార్పులు కనిపించవచ్చు.