Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు .. ఈసారి ఎంతంటే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
బంగారం ధరల పెరుగుదలకు అంతు లేకుండా పోతుంది. ఒకరోజు స్వల్పంగా తగ్గిందని సంతోషించే లోపే భారీగా పెరిగి నిరాశకు గురి చేస్తుంది. బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక కష్టంగానే మారుతుంది. డిమాండ్ పెరగడంతోనే ధరలు కూడా అదుపు లేకుండా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం కూడా పెరుగుదలకు కారణమంటున్నారు.
తగ్గుతాయని అనుకున్నా...
ఇక బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని భావించినా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి లక్షా ఆరు వేల రూపాయలుగా ఉంది. ఇంత పెద్దమొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంపై వినియోగదారులు తర్జనభర్జన పడుతున్నారు. కొంత కొనుగోళ్లు మందగించడంతో కార్పొరేట్ దుకాణాలు కూడా రాయితీలు ప్రకటిస్తున్నాయి. ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో గిరాకీ ఉన్నా తాము ఆశించినంత రీతిలో కొనుగోళ్లు లేవని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోళ్లు దాదాపు ముప్ఫయి శాతం తగ్గాయని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నామని, అయినా కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.
మళ్లీ పెరిగి...
మరొక వైపు పెట్టుబడులు పెట్టేవారు కూడా ఒకింత ఆలోచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చన్న ధోరణిని కనబరుస్తున్నారు. దీంతో కొండెక్కిన బంగారం ధరలు ఎప్పుడు దిగివస్తాయా? అని వేచి చూస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. తులం బంగారం పై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 78,000 రూపాయలకు చేరువలో ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,580 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,07,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.