ఎయిర్‌పోర్ట్‌లో జిగేల్‌మన్న ఫ్రూటి బాటిళ్లు.. అసలు విషయం తెలిస్తే..

ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌అధికారుల తనిఖీల్లో దిమ్మదిరిగే అంశాలు బయటపడుతున్నాయి. ఎవ్వరికి అనుమానం రాకుండా తీసుకువచ్చే..

Update: 2023-11-21 14:47 GMT

ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్‌అధికారుల తనిఖీల్లో దిమ్మదిరిగే అంశాలు బయటపడుతున్నాయి. ఎవ్వరికి అనుమానం రాకుండా తీసుకువచ్చే బంగారం ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్‌ అధికారులు చిక్కపోతున్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా సులభంగా దొరికిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర దేశాల నుంచి భారత్‌లో దిగిన ప్రయాణికులు

అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా బంగారం విలువ రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో దానినే అక్రమార్కులు తమ అక్రమార్జనకు వనరుగా మార్చుకుంటున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. బ్యాంకాంక్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో దిగిన ఈ మహానుభావుడు ఎలాంటి ప్లాన్‌ వేశాడో తెలిస్తే మైండ్‌ బ్లాకైపోతుంది.

కస్టమ్స్‌ అధికారులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్‌ మొదలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వరకు అన్ని మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు బ్యాంకాంక్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యాడు.



ప్రూటీ బాటిళ్లలో బంగారం బిస్కెట్లు:

ఎయిర్‌ పోర్టులో దిగిన ఈ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ వ్యక్తి బ్యాగులో కొన్ని ఫ్రూటీ లాంటి డబ్బాలు కనిపించాయి. ఈ బాటిళ్లు ఏదో తేడాగా ఉందని గమనించిన కస్టమ్స్‌ అధికారులు పరీక్షించి చూడగా, డబ్బాలను చూసి నివ్వెరపోయారు. బరువు ఎక్కువ ఉండడంతో డబ్బాలను ఓపెన్‌ చేసి చూశారు. అందులో బ్లాక్‌ కలర్‌లో ఉన్న చిన్న బాక్సులు కనిపించింది. వాటిని కట్ చేసి చూడగా గోల్డ్‌ బిస్కెట్స్‌ ఉన్నాయి. సుమారు 4 కిలోల బరువున్న గోల్డ్‌ను గుర్తించారు. దీని విలువ అక్షరాల రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్‌ యాక్ట్‌ 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులు దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా వైరల్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి.

అధికారులు బంగారాన్ని ఎలా వెలికితీశారు?

టెట్రా ప్యాక్ జ్యూస్ ఓపెన్ చేయగా అందులో చిన్న ప్యాకెట్లలో బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. అధికారులు ముందుగా జ్యూస్ ప్యాక్ కట్ చేసి అందులోని బంగారాన్ని బయటకు తీశారు. దీనిని చూసిన కస్టమ్స్‌ అధికారులకు దిమ్మదిరిగిపోయింది.

Tags:    

Similar News