Telangana : తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. జీవో 9పై స్టే

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సంచలన నిర్ణయం ప్రకటించింది. జీవోనెంబరు 9 పై స్టే విధించింది

Update: 2025-10-09 11:27 GMT

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సంచలన నిర్ణయం ప్రకటించింది. జీవోనెంబరు 9 పై స్టే విధించింది. ఎన్నికల షెడ్యూల్ పైన కూడా స్టే విధించింది. నిన్న బీసీ రిజర్వేషన్ల పై మొదలయిన వాదనలు నేడు హైకోర్టులో జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్లపై నేడు ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. ఇంప్లీడ్ పిటీషన్ల వాదనలు ఫైనల్ హియరింగ్ లో వింటామని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. దీంతో మధ్యంతర ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో...
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉత్తర్వులు ఉండే అవకాశం ఉండదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసే అవకాశాలున్నాయని అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు నిన్న కోరారు. స్థానిక ఎన్నిలక నోటిఫికేషన్ పై స్టే ఇచ్చింది. నాలుగు వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.



Tags:    

Similar News