లడ్డూలో కల్తీ నెయ్యిపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే?

తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు

Update: 2025-11-27 06:28 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తనకు ఈ ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైసీపీ హయాంలోనే కాదు.. గతంలోనూ కల్తీ జరిగిందా? లేదా? అన్నది కూడా దర్యాప్తు జరపాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా లబ్దిపొందాలన్న ఆలోచన తమకు లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

చంద్రబాబు రాజకీయ ఆరోపణలు...
రాజకీయ లబ్ది కోసమే అనవసర ఆరోపణలకు కొందరు దిగుతున్నారని తెలిపారు. పరకామణిలో కూడా ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన తెలిపారు. తాను ఏ విచారణకు అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెయ్యి లో నాణ్యతను పరిశీలించేది అధికారులు మాత్రమేనని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకూ లడ్డూ ప్రసాదం విషయంలో ఏమీ తేల్చలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.


Tags:    

Similar News