Pawn kalyan : పాడేరు నియోజకవర్గంలో నేడు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పాడేరులో పర్యటించనున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పాడేరులో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని గిరిజనుల మధ్య జరుపుకోనున్నారు. పాడేరు నియోజకవర్గంలో నందిగరువలో జరిగే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు.
గిరిజనులతో కలసి భోజనం...
ఓనూరు జంక్షన్ వద్ద తొలుత పవన్ కల్యాణ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ప్రధాని జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టని రహదారులను పరిశీలిస్తారు. నందిగరువులో గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారితో కలసి భోజనం చేయనున్నారు.