రాధాకృష్ణన్ ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీసుబ్బారెడ్డి కలిశారు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీసుబ్బారెడ్డి కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో పదకొండు మంది వైసీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాధాకృష్ణన్ ను కలసి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు వైవీసుబ్బారెడ్డి తెలిపారు.
ఈరోజు వైసీపీ మాక్ పోలింగ్...
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍కు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది జగన్ అభిమతమని, కాంగ్రెస్‍కు బలం లేకున్నా పోటో చేస్తోందన్న వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఉప రాష్ట్రప్రతి ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంటకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు.