బాబు ఆర్డర్ వేసినా కరెంటేమో పోవడం లేదట! వైసీపీ ఎంపీ సెటైర్లు

కొవ్వొత్తులు తీసుకుని కరెంటు పోరుకు వెళ్లాలని బాబు ఆర్డర్ వేశాడు. చీపు ట్రిక్కులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.

Update: 2022-05-03 11:13 GMT

others

ఏపీలో కరెంటు కోతల వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంది. ప్రధాన ప్రతిపక్షం కొవ్వొత్తులు, విసినెకర్రలతో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. సోషల్ మీడియాలోనూ వైఎస్ జగన్ సర్కార్‌కి వ్యతిరేకంగా మీమ్స్ అదరగొడుతోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ కుప్పంలో వర్కవుట్ కాలేదంటున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డి. కుప్పంలో చంద్రబాబు ఆర్డర్ వేసినా కరెంటు పోవడం లేదంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీంతో బాబు చీపు ట్రిక్కులకు దిగారంటూ ధ్వజమెత్తారు.

కరెంటు పోరు పేరుతో కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని కుప్పంలోని ఒక గ్రామ టీడీపీ కమిటీకి చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేశాడని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే అక్కడ కరెంట్ మాత్రం పోవడం లేదట. దీంతో ఏదో ప్రమాదం జరిగిందని శాంతిపురం సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి మరీ కరెంటు నిలిపివేయించారని.. చీపు ట్రిక్కులతో ప్రజలను అవస్థలు పెడుతున్నారని ఎంపీ విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని వెళ్తారంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు.

కరెంటు కోతలు, బొగ్గు సరఫరాకి సంబంధించి కేంద్రానికి ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రతి ఏటా 22 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. చైనా ఆస్ట్రేలియాలో ఉత్పత్తి తగ్గడం.. యుద్ధం కారణంగా యూరప్‌లో కరెంటు కొరత ఏర్పడడంతో బొగ్గు టన్ను రూ.22 వేలకు చేరి భగ్గుమంటోందన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించి ఆదుకోవాలని ఆయన కోరారు.



Tags:    

Similar News