Andhra Pradesh : వైసీపీ మండలి సభ్యుల రాజీనామాలు ఒక కొలిక్కి వచ్చినట్లేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుంది

Update: 2026-02-24 08:57 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుంది. వైసీపీకి రాజీనామా చేసిన అయిదురుగు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ అయిదురుగు తమ సమక్షంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని జయ మంగళం వెంకటరమణకు నోటీసులు ఇస్తే 26న హాజరు కావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ లకు నోటీసులు ఇచ్చారు. దీంతో రేపటి నుంచి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలను మోషేన్ రాజు విచారించనున్నారు. తమ రాజీనామాలకు గల కారణాలను మండలి ఛైర్మన్ కు వివరించనున్నారు.

వరసగా రాజీనామాలు చేయడంతో...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదుగురు ఎమ్మెల్సీలు 2024 లో వరుసగా రాజీనామాలు చేశారు. అంతే కాదు పార్టీకి సైతం గుడ్ బై కొట్టారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా, జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ పసుపు కండువా కప్పుకున్నారు. పోతుల సునీత బీజేపీలో చేరారు. గత కొన్ని నెలల నుంచి వీరి రాజీనామాలు అన్నీ చైర్మన్ వద్ద పెండింగులో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని వీరంతా కోరుతూ వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు మండలిలోనూ ఛైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. జయ మంగళం వెంకట రమణ అయితే హైకోర్టుకు వెళ్లి తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించాలని కోరారు. దీనికి ర్టు కూడా వీరి విషయం చూడాలని తెలిపింది.
విచారణలో ఏం చెబుతారన్న దానిపై...
అయితే వీరిని విచారించేందుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి వీరు విచారణలో ఏమి చెబుతారో చూడాల్సి ఉంది. వీరు తాము మనస్పూర్తిగా రాజీనామాలు చేశామని ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. అయితే ఇటీవల జయమంగళం వెంకట రమణ అయితే జగన్ తనకు దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దాంతో అది సంచలనంగామారింది. జయమంగళ వెంకట రమణ తన మనసు మార్చుకున్నారా లేదా అన్నది ఈ విచారణ సందర్భంగా తేలనుంది. అలాగే మరి కొందరి విషయమో కూటమిలో సరైన ఆదరణ లేదని అంటున్నారు. దాంతో వారు ఏమైనా ఆలోచిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. వీరు ఛైర్మన్ ఎదుట తమ అభిప్రాయాన్ని ఎలా చెబుతారన్నది కూటమి నేతలకు కూడా కొంత టెన్షన్ గా ఉంది.
నిర్ణయం తీసుకుంటారా?
మండలి చైర్మన్ ఎమ్మెల్సీలను విచారించి వారి రాజీనామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారా లేదా? అన్న దానిపై స్పష్టత రానుంది. అదే జరిగితే ఈ అయిదు సీట్లు ఖాళీ అవుతాయి. అపుడు వాటిలో ఎన్నికలు పెడితే తిరిగి కూటమికే ఆ సీట్లు వెళ్తాయి. ఈ విషయంలో ఇంత కాలం ఆగిన తరువాత ఇపుడు విచారణ అంటున్నారు అంటే వీరి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారా లేక విచారణ పేరిట సాగదీస్తారా? అన్న అనుమానాన్ని కూడా కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలిలో కూటమి కంటే వైసీపీ బలం ఎక్కువగా ఉంది. దీంతో రాజీనామాలు త్వరగా ఆమోదిస్తే మండలిలోనూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వీలు లేకుండా చేసుకోవచ్చన్నది కూటమి నేతల అభిప్రాయంగా ఉంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.




Tags:    

Similar News