తిరుమల లడ్డూలో కల్తీ కాదు .. కుట్ర జరిగింది వాస్తవమే : చంద్రబాబు
తిరుమల లడ్డూలో కల్తీ తో పాటు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తిరుమల లడ్డూలో కల్తీ తో పాటు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ దీనిపై దర్యాప్తు చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. అందులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. 2020లో టెండర్ నిబంధనను మార్చి నాణ్యత ప్రమాణాలను తగ్గించే పరిస్థితికి వచ్చారన్నారు చంద్రబాబు. బోలేబాబా సంస్థకు ఆర్డర్ ఇచ్చారన్నారు. 2022 ఆగస్టులో కల్తీ జరిగిందని వచ్చినా రిపోర్టును తొక్కి పెట్టే పరిస్థితికి నాటి టీటీడీ బోర్డు ఛైర్మన్ వచ్చిందని చంద్రబాబు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని అన్నారు.
అప్పటి పాలక మండలి ...
2019 -2024 కాలంలో ఇరవై కోట్ల లడ్డూల్లో కల్తీ జరిగిందని చంద్రబాబు అన్నారు. 2022లో భోలేబాబా సంస్థపై విచారణకు ఆదేశించారన్నారు. పాలు ఏ మాత్రం తయారు చేయని సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. 59 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేశారని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాసికరం రిపోర్టు ఉందని గ్రహించి ఈవో ఎన్డీడీబీకి పంపారని చంద్రబాబు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు ఉందని చెప్పడంతోనే తాను బయటకు చెప్సాల్సి వచ్చిందని, అంతే తప్ప మరొకటి కాదని చంద్రబాబు తెలిపారు. తిరుమలలో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పబట్టే తాను చెప్పానని అన్నారు. టెండర్ నిబంధనలకు నీళ్లు వదిలేసి ఇతర కంపెనీలకు ఇవ్వడానికి కారణమయ్యారని చంద్రబాబు చెప్పారు.