Ys Jagan : మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన సాగుతుంది
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన సాగుతుంది. మూడు రోజుల పాటు పులివెందులలోనే జగన్ ఉంటారు. దీంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి తరలి రానున్నారు. పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్ ను నిర్వహించనున్నారు.
ప్రజాదర్బార్ తో...
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. సాయంత్రం వరకు వైఎస్ జగన్ ప్రజాదర్బార్ కొనసాగనుంది. రేపు నందిపల్లిలో శివాలయ ప్రారంభోత్సవానికి వైఎస్ హాజరు కానున్నారు. దీంతో పులివెందులలోని జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.