రాజమహేంద్రవరంలో పాల కల్తీకి కారణాలు ఇవే
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి గల కారణాలు అధికారులు గుర్తించారు.
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి గల కారణాలు అధికారులు గుర్తించారు. కూలెంట్ లీకేజ్ వల్లే పాల కల్తీ జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కూలింగ్ ఛాంబర్‌లో వినియోగించే ఇథలిన్ గ్లైకాల్ అనే విషపదార్థం పాలలో కలిసినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇథలిన్ గ్లైకాల్ లీక్ కావడం వల్లే విషపదార్థం పాలలో కలిసినట్లు గుర్తించారు. ఇథలిన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులు కొందరు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈనెల 15న సాయంత్రం గ్రామస్థుల నుంచి పాల వ్యాపారికి ఫిర్యాదులు అందాయి. పాలు చేదుగా ఉన్నాయని వ్యాపారి గణేష్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు.
కూలింగ్ ఛాంబర్ లో ఉంచిన...
కూలింగ్ ఛాంబర్‌లోనే ఉంచిన పాలను 16వ తేదీ ఉదయం గణేష్ ప్రజలకు ఇచ్చారు. విషపూరితమైన పాలు తాగి ఐదుగురు మృతిచెందగా, మరో 12 మందికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కూలింగ్ ఛాంబర్లలో పాలు నిల్వ చేస్తున్న వ్యాపారి గణేష్ ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖాతాదారుల నుంచి ఫిర్యాదు రావడంతో కూలింగ్ ఛాంబర్‌ను వ్యాపారి బాగుచేయించినట్లు గుర్తించారు. పదేళ్లకు పైగా పాల వ్యాపారం నిర్వహిస్తున్న గణేష్, 125 మందికి పైగా ఖాతాదారులున్నారని అధికారులు తెలిపారు. పాల వ్యాపారి గణేష్‌పై మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో ఐదు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.