Pawan Kalyan : తిరుమలలో లడ్డూ కల్తీకి వారే బాధ్యులు

తిరుమలలో కల్తీ లడ్డు ఎవరు చేశారన్న దానిపై తాను ఎక్కడా మాట్లాడలేదని పవన్ కల్యాణ్ తెలిపారు

Update: 2026-02-24 07:31 GMT

తిరుమలలో కల్తీ లడ్డు ఎవరు చేశారన్న దానిపై తాను ఎక్కడా మాట్లాడలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభలో లఘు చర్చ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. వ్యక్తుల గురించి తాను మాట్లాడటం లేదని, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బాధ్యత వహించాలని తాను ఇప్పటికీ భావిస్తున్నానని తెలిపారు. ఈరోజుకు కూడా వైసీపీ నేతలు ఎందుకు వెనకేసుకు వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. లడ్డూలో నెయ్యి లేకుండా తయారు చేశారని సీబీఐ నివేదికలో పేర్కొందని పవన్ చెప్పారు. నెయ్యిలో కల్తీ లేదని వాదించడం వల్లనే ఈ సభలో ఇందరు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.

అయోధ్యకు పంపిన...
సీబీఐ సిట్ నివేదికలో లడ్డూ తయారీలో ఒక్క లీటర్ కూడా పాలు వినియోగించలేదని చెప్పిందన్నారు. ఈ కేసులో 36 మంది నిందితులుగా చేర్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం తనకు నచ్చిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడానికి నిబంధనలను మార్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. కనీస అర్హతలు లేని సంస్థలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. 48 కోట్ల లడ్డూల విక్రయాలు జరగగా, పందకొండు కోట్ల మందికి నాసిరకం లడ్డూల పంపిణీ జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పారు. టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. చట్ట ప్రకారం దోషులను శిక్షించాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు.


Tags:    

Similar News