వైసీపీ నేతలకు షాకిచ్చిన హైకోర్టు
రెండు కీలక కేసులలో వైసీపీకి చెందిన నాయకులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
రెండు కీలక కేసులలో వైసీపీకి చెందిన నాయకులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కడప మేయర్ సురేశ్‍బాబుకు హైకోర్టులో చుక్కెదురయింది.మేయర్ పదవి నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. జీవో సస్పెండ్ చేయాలంటూ సురేశ్‍బాబు వేసిన అనుబంధ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల కడప మేయర్ సురేశ్ బాబును పదవి నుంచి తొలగించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
పెద్దిరెడ్డి పిటీషన్ పై...
ఇక మరో కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెద్దిరెడ్డి వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తమ ఆధీనంలో ఉన్న అటవీభూముల్లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలని వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. అటవీభూముల ఆక్రమణ కేసులో క్రిమినల్ చర్యలు నిలిపివేయాలన్న పిటిషన్ ను కూడా కొట్టివేసింది.