Andhra Pradesh : ఏపీ కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన

ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది

Update: 2026-03-18 04:16 GMT

ఏపీలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. పాలకవర్గం గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు ముగిసింది.

నేడు బాధ్యతలు...
ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్ కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.


Tags:    

Similar News