నేడు విజయవాడ ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
విజయవాడలో ఈ రోజు ముస్లిం సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది
విజయవాడలో ఈ రోజు ముస్లిం సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో వైఎస్సార్‌సీపీ నిర్వహించే ఇఫార్ విందులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.
విజయవాడలో జరిగే...
రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు, కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు.