కాకినాడ జిల్లాలో పులి చాలా తెలివైనదట

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పెద్దపులి కదలికలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి

Update: 2026-03-18 04:10 GMT

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పెద్దపులి కదలికలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పెద్దపులి తిరుగుతుంది. బవురువాక నుంచి ఉద్దండ జగన్నాథపురం వైపు పెద్దపులి వెళ్లినట్లు కనిపించింది.దీంతో ప్రత్తిపాడు, శంఖవరం సరిహద్దు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.పోతులూరు, శరభవరం, కొంతంగి, కొత్తూరు, వజ్రకూటం వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

బృందాలుగా విడిపోయి...
పులిని 17 హనుమాన్ బృందాలు, 3 మత్తుమందు ఇచ్చే బృందాలు వెంబడిస్తున్నాయని అధికారులు తెలిపారు. పెద్దపులిని పట్టుకునేందుకు కాకినాడ డీఎఫ్‌వో రామచంద్రరావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దపులి చాలా తెలివిగా, చురుగ్గా ఉందని కాకినాడ డీఎఫ్‌వో రామచంద్రరావు తెలిపారు. పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా తప్పించుకుంటోందని, పులి తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కాకినాడ డీఎఫ్‌వో రామచంద్రరావు చెప్పారు.


Tags:    

Similar News