Bhumana Karunakar Reddy : నిరూపిస్తే అలిపిరి వద్దనే తలనరుక్కుంటా
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని పరకామణిలో డబ్బు చోరీ ఘటన తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో జరిగినట్లు నిరూపిస్తే తాను అలిపిరి వద్ద తలనరుక్కుంటానని తెలిపారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని అన్నారు.
వైసీపీ హయాంలోనే పట్టుకున్నామని...
వైసీపీ హయాంలోనే రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రవికుమార్ పరకామణిలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని భూమన తెలిపారు. తాము కొట్టేయాలనుకుంటే దొంగను ఎందుకు పట్టుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. రవికుమార్ కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని, బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.