వైసీపీ హయాంలో భారీ భూకుంభకోణం వెలుగు

నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు, రూ.230 కోట్ల స్కాం బయటపడ్డ నేపథ్యంలో విచారణ డిమాండ్!

Update: 2025-02-09 07:28 GMT

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పాలనలో మరో భారీ భూదందా బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది. బాధితులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంబంధిత భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై రూ.230 కోట్ల విలువైన పేదల భూములను తన అల్లుడు కంపెనీకి అప్పగించిన ఆరోపణలు ఉన్నాయి. రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.




రైతులను బెదిరించి, భయపెట్టి ఎకరా భూమికి రూ.15,62,142లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు, 2024 మార్చి 15న, ఏపీఐఐసీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మంజూరు చేసి, భూములను కాకాణి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డి సీఈఓగా ఉన్న జీకేఎస్ ఇండస్ట్రీయల్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి, విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

Tags:    

Similar News