YSRCP : వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా
వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేశారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్స్ జకియా ఖానం పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనమండలికి రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను పంపారు. కొంత కాలంగా జకియా ఖానం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
డిప్యూటీ ఛైర్ పర్సన్ గా...
అయితే తాను రాజీనామా చేసినప్పుడు మాత్రం తనకు పదవి ఇచ్చిన జగన్ కు మాత్రం కృతజ్ఞతలు తెలిపారు. 2020లో జులైలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపదవి కింద జకియా ఖానంను వైసీపీ ఎమ్మెల్సీగా చేసింది. తర్వాత శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అధికారం కోలోపోయిన తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. తిరుమల వీఐపీ టిక్కెట్ల వ్వవహారంలో ఆమె ఆరోపణలను ఎదుర్కొన్నారు.