Ys Jagan : జగన్ కు జ్వరం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు.

Update: 2025-12-24 05:46 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న పులివెందుల చేరుకున్న జగన్ నేడు పులివెందులలో పర్యటించాల్సి ఉంది. అలాగే ఇడుపులపాయకు వెళ్లి అక్కడ జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. కానీ జగన్ ప్రస్తుతం పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాత్రి నుంచి వైఎస్ జగన్ జ్వరంతో...
రాత్రి నుంచి వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతుండటంతో ఆయనను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో జగన్ ఈరోజు ఇడుపులపాయ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్యకర్తలను, పార్టీ నేతలను ఎవరినీ జగన్ వద్దకు అనుమతించడం లేదు.


Tags:    

Similar News