YSRCP : నేడు ఏపీ అసెంబ్లీకి వైసీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు నేడు వైసీపీ సభ్యులు హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు నేడు వైసీపీ సభ్యులు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలని నిర్ణయించారు. ఉదయం పది గంటలకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి హాజరు కానున్నారు. నిన్న రాత్రి బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ నేతలతో సమావేశమయి నిర్ణయించారు.
గవర్నర్ ప్రసంగానికి హాజరై...
గవర్నర్ ప్రసంగానికి హాజరయిన తర్వాత వైసీపీ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశంలో సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవ్వాలా? లేదా? అన్నది నిర్ణయిస్తారు. శాసనమండలిలో మాత్రం వైసీపీ సభ్యులు హాజరై ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళం విప్పాలని నిర్ణయించారు. మండలిలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయిస్తారు.