YSRCP : నేటి నుంచి వైసీపీ రచ్చబండ.. నెల రోజులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పదిహేడు నెలలవుతున్నప్పటికీ ప్రజాసమస్యలను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రజా ఉద్యమం నలభై రోజుల పాటు సాగనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఈరోజు నుంచి నవంబరు 22వ తేదీ వరకూ వైసీపీ రాష్ట్ర మంతటా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
నవంబరు 22వరకూ...
ఈ సందర్భంగాఈ నెల 28వ తేదీన నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించాలని నిశ్చయించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, అమలు చేసిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం, మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ, ఆరోగ్య శ్రీ సేవలు అందకపోవడం వంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది.