YSRCP : మూడు రాజధానులపై సజ్జల హాట్ కామెంట్స్

మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2025-09-12 12:10 GMT

మూడు రాజధానుల అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మూడు రాజధానులంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. తాము అమరావతి నుంచి రాజధానిని తరలించే ఉద్దేశ్యం ఎప్పుడూ లేదన్నారు. ఇంతకు ముందు కూడా అమరావతిని తీసేస్తామని తాము చెప్పలేనిసజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు.

విశాఖలో అయితే...
విశాఖలో డబ్బులు ఖర్చు లేకుండా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని తాము భావించామని తెలిపారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేయడం చంద్రబాబు చేతుల్లో ఉందని తెలిపారు. రాజధాని అంటే భవనాలను నిర్మించడం కాదని, అక్కడ అన్ని రకాల సదుపాయాలను కల్పించాలన్నారు. ఏదైనా అమరావతి రాజధాని అంశం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని పెట్టడానికి మాత్రమే తాము వ్యతిరేకించామని తెలిపారు. గ


Tags:    

Similar News