Ys Jagan : వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
ys jagan met with party mlas
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ ప్రత్యేకంగా శాసనసభ్యులతో సమావేశమయ్యారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వారు బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే...
ఒక వైపు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, మరొక వైపు వైసీపీ అధినేత ఆ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోయినా ప్రతి రోజూ బడ్జెట్ సమావేశాలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ అభిప్రాయాలను తెలియజెబుతామని జగన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నేటి బడ్జెట్ పై మరికాసేపట్లో ఆయన స్పందించే అవకాశాలున్నాయి.