Ys Sharmila : హింసకు మారుపేరు బీజేపీ : వైఎస్ షర్మిల

హింసకు మారుపేరు బీజేపీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

Update: 2026-02-21 05:44 GMT

హింసకు మారుపేరు బీజేపీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఢిల్లీలో ఏదో జరిగిందని ఆంధ్రప్రదేశ్ గల్లీలో పార్టీ ఆఫీసులపై దాడులా ? అని ప్రవ్నించారు. ఇదేం ప్రజాస్వామ్యం ? ఇదెక్కడి దారుణమని షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ గుండాల దాడులు పిరికిపంద చర్య అని వైఎస్ షర్మిల అన్నారు.

బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి...
ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాకోర్టులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నానని షర్మిల అన్నారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తుందన్న వైఎస్ షర్మిల - మోదీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో నిరసన తెలపడం నేరమయిందని అన్నారు. ప్రతిపక్షంపై దాడులు చేయడమంటే దేశ ప్రతిష్టను మరింతగా దిగజార్చడమేనని అన్నారు. మత ఛాందస వాదుల వికృత చేష్టలను శాంతియుతంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నానని వైఎస్ షర్మిల పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News