శ్రీశైలంలో మార్చి 3న ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం శ్రీశైలంలో ఆలయాన్ని మూసివేస్తారు

Update: 2026-02-21 02:53 GMT

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం శ్రీశైలంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు గంటల నుండి రాత్రి . 7.30 గంటల ల వరకు శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ కారణంగా ఆలయాల్లోని అన్ని ఆర్జితసేవలు, పరోక్షసేవలు, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా నిలుపుదల చేశారు. అదే విధoగానే సాక్షిగణపతి, హాఠకేశ్వరం–ఫాలధార - పంచధార ,శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసిస్తారు. . దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా యిదేవిధంగా ఆలయద్వారాలు మూసివేయనున్నారు.

ఉదయం ఆరు గంటలకు...
మార్చి 3వ తేదీ ఉదయం మూడు గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించిన తర్వాత మూసివేయనున్నారు. . మహామంగళహారతులు సమయం నుంచే 4. 30 గంటల నుంచి 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. అనంతరం ఉదయం ఆరు గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయద్వారాలను మూసివేస్తారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరుపుతారు. గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అన్నప్రసాదవితరణ కూడా ఉండదు.


Tags:    

Similar News