వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్సీలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీరిని వరసగా విచారించనున్నారు. ఈ నెల 25వ తేదీన జయమంగళ వెంకటరమణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలకు ఈ నెల 26న విచారణకు రావాలని అన్నారు. అదే రోజు పోతుల సునీత, మర్రి రాజశేకర్ లకు కూడా విచారణకు హాజరు కావాలని శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు.
రాజీనామా విషయంలో...
వీరిని విచారించిన అనంతరం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరి రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్నారు. వీరంతా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసి నెలలు దాటుతుంది. వీరిలో కొందరు తమ రాజీనామాను ఛైర్మన్ ఆమోదించడం లేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఇంతకాలం వీరి రాజీనామాలను పెండింగ్ లో ఉంచిన శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఇక విచారణ చేయాలని నిర్ణయించారు. విచారణ తర్వాత వీరి రాజీనామాల విషయంలో మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోనున్నారు.