Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు

Update: 2025-10-21 02:49 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి నేడు జగన్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు విమానాశ్రయానికి రానున్నారు. ఇటీవల లండన్‌ పర్యటనను ముగించుకుని జగన్ బెంగళూరుకు చేరుకున్నారు.

లండన్ పర్యటన నుంచి...
ఈ నెల 11వ తేదీన వైఎస్ జగన్ లండన్ బయలుదేరి వెళ్లారు. తిరిగి బెంగళూరు చేరుకున్న వైఎస్ జగన్ నిన్న దీపావళి వేడుకలో పాల్గొన్నారు. నేడు మంగళగిరికి రానున్నారు. ఆయన ఈరోజు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమవుతారని తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News