నేడు విచారణకు సునీల్ నాయక్
ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్ విచారణకు హాజరుకానున్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నేడు సీసీఎస్ స్టేషన్‌లో విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్ హాజరుకానున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 5 నుంచి 11 వరకు విచారణకు హాజరైన సునీల్‌నాయక్ మార్చి 12న విచారణకు హాజరుకాలేదు.
హైకోర్టు ఆదేశాలతో...
తల్లి అనారోగ్యం కారణంగా పట్నా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి తీసుకున్న సునీల్‌నాయక్, మార్చి 23న విచారణ అధికారి ముందు హాజరుకావాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్ ముందస్తు బెయిల్ అర్హత పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.