Ys Jagan : నేటి నుంచి మూడు రోజులు పులివెందులలోనే జగన్
నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటంచనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పులివెందులకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటంచనున్నారు.ఆయన ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులకు చేరుకుంటారు. బాకరాపురం క్యాంప్ ఆఫీసుకు చేరుకని అనంతరం ప్రజాదర్బార్ ను నిర్వహిస్తారు. రాత్రికి పులివెందులలోనే జగన్ బస చేస్తారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు పులివెందుల నుంచి ఇడుపుల పాయకు చేరుకుంటారు.
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో...
అక్కడ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం భాకరాపేట క్యాంప్ కార్యాలయానికి వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి పులివెందులలోనే ఉండి జగన్ ఈ నెల 25వ తేదీ ఉదయం 8.30 టగంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుల్లో జగన్ పాల్గొంటారు. జగన్ మూడు రోజుల పాటు పులివెందులలోనే ఉంటారని తెలిసి పెద్దయెత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.