Ys Jagan : పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి బయలుదేరారు

Update: 2026-02-06 05:54 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి బయలుదేరారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబులతో దాడి చేసిన ఘటనపై కుటుంబ సభ్యులను కలసి తెలుసుకోనున్నారు. అయితే రెండు రోజుల క్రితం గుంటూరు పర్యటనలో భారీగా కార్యకర్తలు వచ్చి, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడినందున ఈరోజు పోలీసులు జగన్ పర్యటనపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వెస్ట్ బైపాస్ మీదుగా...
పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్ ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు. వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట మీదుగా గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి జగన్ చేరుకోనున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి జగన్ ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల కాన్వాయ్ తో భారీ కార్యకర్తల మధ్య జగన్ బయలుదేరి వెళుతున్నారు. జోగి రమేష్ ఇంటికి చేరుకుని అక్కడ ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జోగి రమేష్ కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడతారు. వారిని పరామర్శిస్తారు.


Tags:    

Similar News