క్యాలెండర్ ఖరారు చేసిన జగన్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన వివిధ పథకాలను అమలు చేసే తేదీలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు.
ys jagan
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన వివిధ పథకాలను అమలు చేసే తేదీలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశమయి చర్చించారు. మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్ష తర్వాత తేదీలను ఖరారు చేశారు. కోడ్ కారణంగా నిలిచిపోయిన ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను దశలవారీగా అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 14తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవుతుంది. కోడ్ ముగిసిన వెంటనే పథకాలను అమలు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
మార్చి 18న - సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయనున్నారు. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తారు.
మార్చి 22న - ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ఇస్తారు
మార్చి 23న - జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
మార్చి 25 నుంచి వైయస్సార్ ఆసరా ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం
మార్చి 31న- జగనన్న వసతి దీవెన
ఏప్రిల్ 6న - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు
ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం
ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం