Chandrababu :తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు

Update: 2026-03-30 03:38 GMT

తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నాయుడుపేట ప్రాంతంలో పలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు దొరవారి సత్రం మండలంనెల్లబల్లి గ్రామనదికి చేరుకుంటారు. అక్కడి నుంచి పూడడూరు గ్రామానికి వెళ్లి కొత్తగా నిర్మించిన టిడ్కో గృహాలను ప్రారంభించనున్నారు.

నాయుడుపేట మండలంలో...
అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే నాయుడుపేట మండలంలో పలువురు ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. స్థానిక సమస్యలపై చర్చించనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు నెల్లబల్లి గ్రామంలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరి తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


Tags:    

Similar News