Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సుల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి

Update: 2026-03-30 04:56 GMT

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు, అధిక లోడ్ తో ఉన్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 976 బస్సుల తనిఖీలు చేపట్టినట్లు మంత్రి మండిపల్లి వెల్లడించారు.

నిబంధనలు లేని...
సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసులు నమోదు, జరిమానాలు విధించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల్లో కలిపి 16 పాయింట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని, భద్రతా నియమాల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News